నౌకాదళంలో అగ్నివీర్ ఉద్యోగాలు
భారత నౌకాదళం అగ్నివీర్ 01/2027, 02/2027 బ్యాచ్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులుగా 50 శాతం మార్కులతో 10+2 లేదా ఏదైనా ఇంజినీరింగ్ విభాగంలో 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా లేదా ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో రెండేళ్ల ఒకేషనల్ కోర్సు చేసినవారూ అర్హులే.
వయసు: 01/2027 బ్యాచ్ కోసం డిసెంబరు 01, 2004 – మే 31, 2009 మధ్య జన్మించి ఉండాలి. 02/2027 బ్యాచ్ పోస్టులకు మే 01, 2005 అక్టోబరు 31, 2009 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.550 + 18 శాతం జీఎస్టీ.
వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.30,000. రెండో ఏట రూ.33,000. మూడో సంవత్సరం రూ.36,500. నాలుగో ఏడాది రూ.40,000. ప్రతి నెలా జీతంలో పది శాతం మినహాయిస్తారు. అంతే మొత్తం అదనంగా కలుపుతారు. ఇలా నాలుగేళ్ల తర్వాత వడ్డీతో కలిపి సుమారు రూ.10.04 లక్షల ‘సేవా నిధి’ ప్యాకేజీ అందుతుంది.
ఎంపిక: రెండు దశల్లో. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. రెండో దశలో ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు, వైద్య పరీక్షలు ఉంటాయి.
దరఖాస్తు ప్రారంభం : 14.03.2026.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06.04.2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)