9th September 2019 – Current Affairs – International, National, State

Daily Current

International – National – AP -Telanagana

Download PDF

జాతీయ అంతర్జాతీయ ఇతర ముఖ్య అంశాలు

  1. అమెరికా అధ్యక్షుడు మరియు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షు డు ఏ ఉగ్రవాద సంస్థ తో జరపాల్సిన రహస్య మంతనాలు రద్దయ్యాయి..?
    A. లష్కరే తోయిబా
    B. తాలిబాన్
    C. ISIS
    D.హిందూ హిజహుద్దిన

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans : B
Explanation :వాషింగ్టన్‌: తాలిబన్‌ నేతలతోపాటు అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీతో జరగాల్సిన రహస్య భేటీని రద్దు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అమెరికా సైనికుడి మృతికి కారణమైన కాబూల్‌ పేలుడుకు కారణం తామేనంటూ తాలిబన్‌ చేసిన ప్రకటనపై ఆయన ఈ మేరకు స్పందించారు. దీంతో అఫ్గానిస్తాన్‌లో శాంతి నెలకొల్పే లక్ష్యంతో అమెరికా– తాలిబన్‌ల మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న ప్రయత్నాలకు విఘాతం ఏర్పడినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. అఫ్గాన్‌ అధ్యక్షుడు ఘనీతోపాటు తాలిబన్‌ నేతలతో ఆదివారం డేవిట్‌ రిట్రీట్‌లోని తన క్యాంపు కార్యాలయంలో భేటీ కానున్నట్లు ట్రంప్‌ శనివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
[/bg_collapse]

2. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 విజయవంతం అయిందని పేర్కొన్న పాకిస్తాన్‌కు చెందిన తొలి మహిళా వ్యోమగామి ఎవరు..?
A. నమీరా సలీమ్‌
B. అనార్కలి
C. సలీమ్ చొదరి
D. సలీం నిగమ్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : కరాచీ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2పై పాకిస్తాన్‌కు చెందిన తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీమ్‌ అభినందనలు తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసేందుకు ఇస్రో చేసిన ప్రయత్నం చరిత్రాత్మకమైందని అన్నారు. కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న సైంటియా అనే సైన్స్‌ మ్యాగజైన్‌తో నమీరా మాట్లాడుతూ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్‌-2ను దక్షిణ ఆసియా సాధించిన విజయంగా ఆమె అభివర్ణించారు. ఇది ప్రపంచ అంతరిక్ష రంగానికి గర్వకారణమని చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రాంతీయ అభివృద్ధికి దక్షిణ ఆసియాకు చెందిన ఏ దేశం విజయం సాధించినా.. అది ఆ ప్రాంతం మొత్తానికి గర్వకారణమని చెప్పుకొచ్చారు.
[/bg_collapse]

3. సెప్టెంబర్ 1 వ తారీఖు నుండి అమల్లోకి వచ్చిన మోటారు వాహన సవరణ చట్టం ప్రకారము అనూహ్యరీతిలో చాలన్స్ వసూలు చేసిన రాష్ట్రం ఏది..?
A. తమిళనాడు
B. ఆంధ్ర ప్రదేశ్
C. ఢిల్లీ
D.కర్ణాటక

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: D
Explanation : బెంగళూరు : కొత్త మోటారు వాహన సవరణ చట్టంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చినప్పటి నుంచి వాహనాలను రోడ్డు మీదకు తీసుకురావాలంటేనే భయపడిపోతున్నారు. అయితే మిగతా దేశంతో పోల్చితే రెండు రోజులు ఆలస్యంగా ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చిన కర్ణాటక రాష్ట్రం జరిమానాలలో మాత్రం దూసుకుపోతోంది. ఒక్క బెంగళూరులోనే కేవలం ఒక్క వారానికి రూ.72,49,900 వసూలు చేసి బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు ఔరా అనిపించారు.
[/bg_collapse]

4. దేశంలో తొలి హైస్పీడ్ రైలు వందేభారత్ express విజయవంతం కావడంతో రైల్వే శాఖ కొంత రాబోయే 2 ఏళ్లల్ ఎన్ని ప్రాజెక్టులను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది..?
A. 40
B. 50
C. 60
D. 30

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో తొలి సెమీ హైస్పీడ్‌ రైలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఈ తరహా రైళ్లను మరికొన్నింటిని ప్రవేశపెట్టేందుకు రైల్వేలు ప్రయత్నిస్తున్నాయి. రానున్న రెండేళ్లలో కొత్తగా 40 వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. సెమీ హైస్పీడ్‌ రైళ్ల కోసం ఇటీవల చేపట్టిన టెండర్‌ ప్రక్రియపై తీవ్ర విమర్శలు రావడంతో రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ జోక్యం చేసుకుని సమస్యను చక్కదిద్దారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ల తయారీకి నూతన టెండర్‌ ప్రక్రియను రైల్వే బోర్డు చేపట్టడంతో ఈ రైళ్లు త్వరలో పట్టాలెక్కేందుకు కార్యాచరణ ప్రణాళిక ఖరారైంది. ప్రస్తుతం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢిల్లీ, వారణాసి మధ్య రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే.
[/bg_collapse]

5. చిరకాల ప్రత్యర్థులైన ఏ రెండు దేశాల మధ్య ఇటీవల యుద్ధ వాతావరణం నెలకొంది..?
A. అమెరికా, రష్యా
B. ఉత్తర కొరియా దక్షిణ కొరియా
C. ఇజ్రాయిల్ పాలస్తీనా
D. భారత్-చైనా

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: C
Explanation : ఇజ్రాయెల్‌ మీదకు రాకెట్లను ప్రయోగించిన పాలస్తీనా – ప్రతిదాడికి దిగిన ఇజ్రాయెల్‌
జెరూసలేం, సెప్టెంబర్‌ 7: చిరకాల ప్రత్యర్థులైన ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఇజ్రాయెల్‌ మీదకు పాలస్తీనా రాకెట్లతో దాడులు చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉన్న సరిహద్దులో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు పాలస్తీనా యువకులు మరణించారు. అనంతరం ఇజ్రాయెల్‌ దళాలు పాలస్తీనాకు చెందిన గాజా ప్రాంతంపై దాడులు జరిపాయి. ప్రధానంగా సైనిక పోస్టులు, బలగాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎవరూ మరణించలేదని పాలస్తీనా ప్రకటించింది. కానీ సరిహద్దులో శుక్రవారం జరిగిన కాల్పుల్లో తమ దేశానికి చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా.. 46 మంది గాయపడ్డారని పేర్కొంది. ఇజ్రాయెల్‌ సైన్యం స్పందిస్తూ శనివారం గాజా ప్రాంతం నుంచి తమ గగనతలంలోకి ఓ డ్రోన్‌ కూడా ప్రవేశించిందని తెలిపింది. ఈ డ్రోన్‌ ఓ పేలుడు పదార్థాన్ని జార విడిచిందని, దీంతో సైనిక వాహనం ధ్వంసమైందని పేర్కొంది.
[/bg_collapse]

ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్

1.గోదారోళ్ల కితకితలు పేరుతో ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ఆదివారం నిర్వహించిన నాలుగో ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు ఏడు వేల మంది హాజరవడంతో ఈ కార్యక్రమం కి ఏ రికార్డ్ లభించింది..?
A. గిన్నిస్ రికార్డు
B. భారత్ ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్
C.లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్
D.ఏది కాదు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: B
Explanation : సాక్షి, రాజమహేంద్రవరం రూరల్‌: గోదారోళ్ల కితకితలు పేరుతో ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ఆదివారం నిర్వహించిన నాలుగో ఆత్మీయ సమ్మేళనానికి దాదాపు ఏడు వేల మంది హాజరవడంతో భారత్, ఆంధ్రా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరు సుబ్బరాజు తోటలో ఈ సమ్మేళనాన్ని నిర్వహించారు. భారత్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ చీఫ్‌ ఎడిటర్‌ కె.అన్నపూర్ణ.. గ్రూప్‌ అడ్మిన్‌ ఈవీవీ సత్యనారాయణకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
[/bg_collapse]

2. ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవులు 2019 జాతీయ ప్రతిభ పురస్కారానికి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు. ..?
A. పి సుశీల
B. ఎస్పి జానకి
C. ఉష
D. గీతా మాధురి

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : విశాఖపట్నం ,మద్దిలపాలెం : గానకోకిల, సినీ నేపధ్యగాయని పి.సుశీల ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవులు 2019 జాతీయ ప్రతిభ పురస్కారానికి ఎంపికయ్యారు. నగరంలోని మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో సోమవారం జరిగే కొప్పరపు కవుల కళాపీఠం 17వ వార్షికోత్సవంలో అతిరథ మహారథుల చేతుల మీదుగా ప్రదానం చేయనున్నారు. అలాగే సంప్రదాయ ప్రకారం అవధాన విద్యలో సాహితీవేత్తలకు ఇచ్చే‘ అవధానాచార్య’ పురస్కారానికి డాక్టర్‌ అశావాది ప్రకాశరావును ఎంపిక చేశారు. కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి (పూర్వాశ్రమంలో) ప్రసాదరాయ కులపతికి‘గురుపూజోత్సవం ’నిర్వహించనున్నారు
[/bg_collapse]

3.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోకయుక్త గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు..?
A. లక్ష్మణ్ రెడ్డి
B. పి నారాయణ రెడ్డి
C. శ్రీనివాస్ రెడ్డి
D. సురేందర్ రెడ్డి

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి నిరోధానికి తీసుకుంటున్నచర్యల్లో భాగంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏపీ లోకాయుక్తగా జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించింది. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి గతంలో ఏపీ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా పనిచేశారు. లోకాయుక్త నియామకంతో పెండింగ్‌ కేసుల పరిష్కారం వేగవంతం కానున్నాయి. ఇటీవల తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ప్రకారం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తిని లోకాయుక్తగా నియమించుకునే వెసులు బాటు ప్రభుత్వానికి ఉంది. లక్ష్మణ్‌రెడ్డిని లోకాయుక్తగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
[/bg_collapse]

4. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లోనిఈ ఉద్యోగాలలో అమలు చేయాలని ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం వేయడం జరిగింది..?
A. గ్రూప్ 1 ఉద్యోగాలలో
B. గ్రూప్ 2 ఉద్యోగాలలో
C. గ్రూప్ డీ
D. వార్డు సచివాలయ ఉద్యోగులలో

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: D
Explanation : ఈడబ్ల్యూఎస్‌ కోటాపై ప్రమాణపత్రం
ఈనాడు, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) కేటాయించిన 10% రిజర్వేషన్లను గ్రామ, మున్సిపల్‌ వార్డుల సచివాలయ పోస్టుల భర్తీలో అమలు చేయాలని అభ్యర్థిస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను ఏపీ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు పి.రాకేష్‌రెడ్డి దాఖలు చేశారు.
[/bg_collapse]

తెలంగాణ రాష్ట్ర కరెంట్ అఫైర్స్

1.రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఎంత మొత్తం తో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది..?
A. లక్ష 65 వేలు
B. లక్ష 80 వేలు
C. లక్ష 45 వేలు
D. లక్ష 15 వేలు

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: A
Explanation : సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ.లక్షా 65 వేల కోట్ల అంచనాలతో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిసింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఆదివారం రాత్రి ప్రగతిభవన్‌లో సమావేశ మైన రాష్ట్ర మంత్రివర్గం కొత్త బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీంతోపాటే వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ సోమవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. ఇటు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్ట నున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సెప్టెంబర్‌ 30తో కాలపరిమితి ముగియబోతోంది.
[/bg_collapse]

2.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి గిరిజన మహిళా మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం లో ఎవరికి చోటు దక్కింది..?
A. సత్యవతి రాథోడ్
B. సత్యవతి నాయక్
C. భూక్య భారతి
D. పద్మజా నాయక్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans : A
Explanation : సాక్షి, మహబూబాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి గిరిజన మహిళా మంత్రిగా కేసీఆర్‌ ప్రభుత్వంలో సత్యవతి రాథోడ్‌ చోటు దక్కించుకున్నారు. అనుభవం, పనితీరు కారణంగా ఆమెకు మంత్రి వర్గంలో గిరిజన కోటాలో స్థానం లభించిందని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ సత్యవతిరాథోడ్‌ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఆమెకు సీఎం కేసీఆర్‌ గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖను కేటాయిం చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి గిరిజన మహిళగా ప్రమాణ స్వీకారం చేయటంతో గిరిజన జిల్లా అయిన మానుకోటలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.
[/bg_collapse]

3. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజి సాహితీ పురస్కారం అందుకున్న కోట్ల వెంకటేశ్వరరెడ్డి ఏ జిల్లాకు చెందిన చెందినవాడు..?
A. నల్గొండ
B. వరంగల్
C. మహబూబ్నగర్
D. కరీంనగర్

[bg_collapse view=”button-orange” color=”#72777c” icon=”arrow” expand_text=”Show More” collapse_text=”Show Less” ]
Ans: C
Explanation : రవీంద్రభారతి: ప్రజాకవి, సాహితీవేత్త కాళోజీ నారాయణరావు కలం యోధుడు అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కవిత్వం పోరాటస్ఫూర్తిని రగిలించి వెన్నుతట్టి ముందుకు నడిపించిందన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సోమవారం రాత్రి ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి, పద్మవిభూషణ్‌ కాళోజీ నారాయణరావు 105వ జయంతి ఉత్సవం- తెలంగాణ భాషా దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి కాళోజీ చిత్రపటానికి పుష్పాలను సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రముఖ కవి కోట్ల వెంకటేశ్వరరెడ్డిని ఘనంగా సత్కరించి కాళోజీ సాహితీ పురస్కారం, 1,01,116 నగదు ప్రదానం చేశారు.
[/bg_collapse]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *