Advertisements

తెగిన గాలిపటం..? Dreams is not what you see in sleep it is the thing which doesn’t let you sleep…

తెగిన గాలిపటం..?
.
.
.
ఊహలలో విహరించడం మానసిక ఆనందాన్ని ఇవ్వవచ్చు కానీ… మెలకువ రాగానే కల చెదిరిపోతుంది…?‍♂

దృఢమైన సంకల్పం తో కలని నిజం చేసుకోవాలనే ప్రయత్నంలో.. ఎన్నో ఆటంకాలు ?.. ఎన్నో అవరోధాలు..? మరెన్నో అవమానాలు…? ఎదురవుతాయి..

ఒక రాయి శిల్పం గా మారాలంటే ఉలి దెబ్బ తప్పనిసరి…?

ఆటంకాలకు, అవమానాలకు, అవరోధాల కు భయపడితే శిల్పం లా కాదు కదా – బండ రాయిలా ఉన్నా ప్రయోజనం ఉండదు..?

సమస్యలు అనే ప్రవాహాలకు చేపల ఎదురీదాలి…? సింహంలా ఎదురు తిరగాలి..? ..
నీ పేదరికం ఎప్పటికీ నీకు సమస్య కాదు… చిత్తు కాగితాలు ఏరుకునే వారు కూడా దృఢ సంకల్పంతో మహోన్నత శిఖరాలకు చేరిన వారు ఉన్నారు…?

మన జ్ఞానానికి పదును పెడితే నే మెరుపు వంటి ఆలోచనలు అంకురార్పణ చేస్తాయి.. మన ఆలోచనల నుండి పుట్టే విజ్ఞానం, దృఢ సంకల్పం – ఆటంకాలను అవరోధాలను పటాపంచలు చేస్తుంది… నూతన మార్గాల కి బాటలు వేస్తుంది..?

కలలో కనే కలకి – నీ ప్రయత్నంతో రంగుల అద్దాలి -? నూతన ఆలోచనలతో ముందుకు సాగాలి – అప్పుడు మాత్రమే నువ్వు కన్న కల కి ప్రాణం వస్తుంది…

అది నువ్వు కోరుకునే ఉద్యోగం కావచ్చు ?, నువ్వు కలలు కనే జీవితం కావచ్చు?, నీ పైన కొండంత ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల నమ్మకాలు కావచ్చు?‍❤?

ఊహల్లో విహరించడం అంటే తెగిన గాలిపటం వంటిది – అడ్డూ అదుపు లేని ప్రయాణం – నియంత్రణ, నియంతృత్వం లేని జీవితం –
కలని గాలిపటాన్ని ఒడిసి పట్టుకున్న అప్పుడే – జ్ఞానం వికసిస్తుంది.

నిజమైన విజయానికి ముందు అపజయమే ఉంటుంది —

ప్రయత్నం చేసి ఓడిపోతే నీ తప్పు కాదు.. కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోతే అది కచ్చితంగా నీ తప్పే….?

♥ నా విద్యార్థులకు అంకితం..?

RK..✍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *